Monday, 22 August 2011
Chiru 150th film in 2014
2014లోపే 150వ సినిమా
* ఎన్నికలకు ముందే చిరు మూవీ
* సోనియా ఊ కొడితేనే తెరపై చిరు
* కాంగ్రెస్ పొలిటికల్ మైలేజీకి చిరు మూవీ!
* ఎన్నికలే లక్ష్యంగా చిరు సినిమా
* ఎలక్షన్లకు చిరు 150వ మూవీ లింక్
* రికార్డు మూవీ కథేంటి!
* డైరెక్ట్ చేసేది ఎవరు
* చిరుది గెస్ట్ రోలా మెయిన్ రోలా!
పాలిటిక్స్‌లో యమ బిజీగా ఉన్న మెగాస్టార్ 150వ మూవీ చేస్తారా... చేయరా. ఈ ఉత్కంఠే ఫ్యాన్స్‌ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మూడు దశాబ్దాలపాటు ఓ వెలుగు వెలిగిన చిరు రికార్డ్ సినిమా చేస్తారన్న సంకేతాలు బలంగానే విన్పిస్తున్నాయి. అందుకు తగ్గ లాజిక్ కూడా కన్పిస్తోంది. అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఇష్టాఇష్టాలపైనే ఇప్పుడు చిరు సినీ లైఫ్ ఆధారపడింది. మేడం OK చెబితే మెగా అభిమానుల అభిలాష తీరుతుంది.
రాజకీయాలను సమూలంగామార్చేస్తానని.. సేవే లక్ష్యం ప్రేమే మార్గంగా చిరంజీవి పొలిటికల్ ఎంట్రి ఇచ్చారు. గ్యాంగ్‌లీడర్‌గా అవతారమెత్తినా సక్సెస్ కాలేకపోయారు. ముచ్చటగా మూడేళ్లలోపే ఫేస్ టర్నింగ్ ఇచ్చారు. అధికార కాంగ్రెస్‌లో కలిసి పోయారు. టాలీవుడ్‌లో చిరంజీవి లెజెండ్. ఇప్పటి వరకు ఆయన 149 సినిమాల్లో నటించారు. మూడు దశాబ్ధాలు ఇండస్ట్రీని ఓ రకంగా శాసించారు.
ఎన్నో రికార్డులు, మరెన్నో అవార్డులు. బాక్సాఫీసు బద్దలుకొట్టిన మూవీలూ ఉన్నాయి. మెగాస్టార్ స్టెప్పులతో పంచ్ డైలాగ్‌లకు ఫ్యాన్స్ మైమరిచిపోయారు. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా చిరుకు ఇమేజ్ తెచ్చి పెట్టింది. సీన్ కట్ చేస్తే... సినిమాల్లో నటించబోనని చిరు ప్యాకప్ చెప్పేశారు. CM పీఠమే అధిష్టిస్తానని ప్రకటించారు. ఫ్యాన్స్ ఒక్కసారిగా డీలా పడ్డారు.
పొలిటికల్ కెరిర్‌తోపాటు తమ ఫ్యామిలీకి ప్రాబ్లమని గ్రహించిన చిరు తనయుడు రాంచరణ్ తేజ తీపి కబురు చెప్పారు. డాడీ 150వ మూవీలో నటిస్తారని దానికి తానే నిర్మాతనని చెప్పుకొచ్చారు. ఆ వెంటనే బిగ్ బీ అమితాబ్ కూడా చిరు యాక్ట్ చేయాలని ఆ చేయబోయే మూవీలో తాను గెస్ట్ రోల్ పోషిస్తానని ఆకాంక్షను వెలిబుచ్చారు. స్టార్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ ఏకంగా ఆ సినిమా తానే డైరెక్ట్ చేస్తానని ప్రకటించడం చకచక జరిగిపోయాయి.
ఇవే ఇప్పుడు చిరు ఫ్యాన్స్‌లో ఆశలు రేపుతున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఉనికి కాపాడుకోవాలంటే చిరు మూవీ కంపల్సరి అన్న భావన వ్యక్తమవుతోంది. ఛరిష్మా ఉన్న లీడర్ లేక ఇప్పటికే చతికిలపడ్డ పార్టీకి చిరుయేఆశా దీపం. ఉద్యమాలతో అటు పార్టీ ఇటు ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరవుతోంది. 2014 ఎన్నికలు ఎదుర్కొవాలంటే అంత ఈజీ కాదు.
అందుకే చిరు ఇమేజ్‌ను ఓట్లుగా మలుచుకుంటే కాస్త గట్టెక్కే అవకాశం ఉంది. సో ఎన్నికల నోటిఫికేషన్‌కు అటూ ఇటుగా చిరు 150వ మూవీ విడుదలవుతుందని టాక్. పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చే ముందు మెగాస్టార్ చేసిన సినిమాలన్ని సమాజానికి సందేశాలు ఇచ్చినవే. ఠాకూర్, ఇంద్ర, స్టాలిన్ మూవీలు అన్నయ్య ఇమేజ్‌ను అమాంతం పెంచేశాయి.
ఆ తర్వాత చిరు జరిపిన AP టూర్‌కు అటు ఫ్యాన్స్, ఇటు జనం బ్రహ్మరథం పట్టారు. ఆ మూడు సినిమాలకు తగ్గట్టుగా... ఓట్లు రాలే విధంగా కథాంశం ఉంటుందని అంచనా. ఇప్పటికే పలువురు అగ్ర కథారచయితలు ఆ పనిలో ఉన్నట్లు సమాచారం. కథాంశం ఎలా ఉంటుందనేది సస్పెన్స్.
అయితే ఈ మూవీలో చిరు మెయిన్ రోల్ చేస్తారా, చేయరా అన్నది కూడా ఆసక్తి రేపుతోంది. మగధీరలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన మెగాస్టార్... రికార్డ్ మూవీలో అలా చేయరన్న టాక్ కూడా ఉంది. పైగా గెస్ట్ రోల్ చేస్తానని అమితాబచ్చన్ లాంటి సినీ దిగ్గజం అన్నారంటే సినిమా ఓ రేంజ్‌లోనే ఉంటుందని... మరో టాక్. సో చిరు ఫ్యాన్స్‌కు మళ్లీ పండగ వచ్చేస్తోంది.
పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అమెరికా నుంచి వచ్చిన కొద్ది రోజులకు ఈ అంశంపై కూలంకషంగా చర్చించిన తర్వాతే క్లారిటి రానుంది. అయితే 2014 నాటికి చిరు మూవీ అన్నది ఖాయంగా కన్పిస్తోంది
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment